YS Jagan సర్కార్‌కు ముగిసిన డెడ్ లైన్ .. రంగంలోకి పవన్

వైఎస్సార్‌సీపీ పాలనపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యింది జనసేన. ఈ నెల 14న అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా.. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఈ నివేదికను ప్రజల ముందు ఉంచబోతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడువు ముగియడంతో నివేదిక ఇచ్చేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటనను ట్వీట్ చేసింది